భాయ్ కొలుకొంటున్నాడా…?
తొలి రోజే ఫ్లాప్ టాక్ మూటగట్టుకొన్నాడు భాయ్. కథా, కథనాల్లో
వైవిధ్యం లేకపోవడం వల్ల.. అంచనాలకు చేరువ కాకపోయింది. దానికి తోడు
వర్షాలు కూడా ముంచేశాయి. కానీ శని, ఆది వారాల్లో వసూళ్లు సంతృప్తిగానే
ఉన్నాయి. తొలి మూడు రోజులకూ దాదాపు రూ. 12 కోట్లు వసూలు చేసిందని
సమాచారమ్. దాంతో కాస్త ఒడ్డున పడినట్టే. శాటిటైట్ రూపేణా ఈ సినిమాకి
బాగానే గిట్టింది. జీ తెలుగు రూ.5 కోట్లు వెచ్చించి శాటిలైట్ రైట్స్
జేజిక్కించుకొంది. మొత్తమ్మీద.. భాయ్ కాస్త కోలుకొన్నాడు. సోమవారం నుంచి
వసూళ్ల రేంజును బట్టి.. భాయ్ భవితవ్యం ఆధారపడి ఉంది.