ఖైదీకి 30 యేళ్లు
చిరంజీవి కెరీర్ నే కాదు.. తెలుగు చిత్రసీమలో యాక్షన్ కథా చిత్రాల
గమనాన్ని మార్చిన చిత్రం ఖైదీ. ఈ చిత్రంతో ఓ యాంగ్రీ యంగ్ మెన్ తెలుగు
చిత్రసీమలో చిరంజీవి రూపంలో విజృంభించడం మొదలెపెట్టాడు. ఖైదీ చిరంజీవి
ని ఓ స్టార్ చేసింది. చిరంజీవి స్టామినా తెలుగు చిత్రసీమకు తొలిసారి
పరిచయం చేసింది. అందుకే ఈ సినిమాని చిరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమా
విడుదలై నేటికి 30 యేళ్లు. చిరంజీవి సరసన మాధవి కథానాయికగా
నటించింది. అప్పటి నుంచీ వీరిద్దరిదీ హిట్ పెయిర్‌గా నిలిచింది.
కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రగులుతోంది
మొదలిపొద పాట ఆల్‌టైమ్ హిట్. యాక్షన్ చిత్రాల ఒరవడికి కొత్త ఊపు ఇచ్చిన
ఖైదీ నేటికీ ఓ క్లాసిక్కే..!